విశాఖలో శుక్రవారం ఉదయం కార్ షెడ్ జంక్షన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మపురి కాలనీకి చెందిన ముగడ సింహాచలం (65) రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొనడంతో మృతి చెందారు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింహాచలం భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.