విశాఖలోని వాల్తేర్ డివిజనల్ రైల్వే ఆసుపత్రిలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ముఖ్య అతిథిగా హాజరై, ఫాకో మెషీన్, మల్టీపారామీటర్ పేషెంట్ మానిటర్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. 'టుగెదర్ ఫర్ హెల్త్: స్టాండ్ విత్ సైన్స్' ఇతివృత్తంపై అవగాహన కల్పించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ రాకేష్ డుబ్బా సరైన ఆహారం, వ్యాయామం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఈసీఓఆర్‌డబ్ల్యూవో అధ్యక్షురాలు జ్యోత్స్న బోహ్రా, ఏడీఆర్‌ఎంలు శాంతారాం, రామారావు, వైద్యులు పాల్గొన్నారు.