విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఏఎస్ఐ ఎం.వి.ఎస్. ప్రసాద్ శుక్రవారం మధ్యాహ్నం ఆర్అండ్‌బి కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించి హల్చల్ చేశారు. పై అధికారుల పర్యవేక్షణ లేకుండానే తాళాలు లాక్కొని వాహనాలను నిలిపివేసినట్లు విమర్శలు వచ్చాయి. దురుసుగా ప్రవర్తించారని బాధితులు చెబుతున్నారు. సీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.