విశాఖలో తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్: పర్యాటకులకు పండుగ

విశాఖపట్నంలో జనవరి 23 నుండి 31 వరకు తొమ్మిది రోజుల పాటు 'విశాఖ ఉత్సవ్' పేరుతో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ ఉత్సవంలో వినోదం, ఆహారంతో పాటు దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల సమక్షంలో విశాఖ ఉత్సవ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి దీనిపై దిశా నిర్దేశం చేస్తారు.

సంబంధిత పోస్ట్