విశాఖలోని మధురవాడ పరిధిలోని రహదారులు ద్విచక్ర వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. శుక్రవారం పరదేశిపాలెం జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమ్మాదికి చెందిన సెక్యూరిటీ గార్డు బలరామ్ (58) మృతి చెందగా, ఆయన భార్య తులసమ్మ (45) తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై మధురవాడ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.