విశాఖపట్నంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిగా ఎస్. వెంకటేశ్వర రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో క్రీడా అధికారిగా పనిచేసిన వెంకటేశ్వర రావు, బదిలీపై విశాఖపట్నం వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.