విశాఖ జనసేన కార్పొరేటర్‌ వేధింపులకు బాధితుల ఆత్మహత్యాయత్నం

విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేధింపులు భరించలేక చాకలిపేటలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ విద్యుత్ మీటర్లు తొలగించాలని మూర్తి యాదవ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు శుక్రవారం పెట్రోల్ పోసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్