విశాఖలోని సీతంపేట జనసేన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో భారీ సంఖ్యలో పార్టీలో చేరికలు జరిగాయి. 35వ వార్డు జనసేన ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్, వార్డు ప్రెసిడెంట్ త్రినాథ్ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి పైగా జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన అందిస్తోందని, విశాఖ సౌత్‌లో జనసేన పట్టును తాను నిరూపించుకుంటున్నానని పేర్కొన్నారు.