సింహాచలం గిరిప్రదక్షిణకు భక్తులు బ్రహ్మరథం పట్టారు. కనివినీ ఎరుగని రీతిలో భక్తులు తరలివచ్చారు. సుమారు 9 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేశారు. బుధవాం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారు జాము వరకు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు సింహగిరికి చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.