విశాఖ జీవీఎంసీ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక 35వ వార్డు కల్లుపాకలు, వెల్లంపేట, ప్రసాద్ గార్డెన్స్ తదితర ప్రాంతాలలో గురువారం వైకే రాజు కళాబృందం.. కళాకారులచే వీధినాటిక, జానపద గీతాలతో ప్రజలను చైతన్యపరిచారు. దోమల పట్ల జాగ్రత్తలు, దోమల నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీఎంసీ సూచనలు చేశారు.