విశాఖ‌: మేఘాద్రి గెడ్డ‌లో ప‌డి బీటెక్ విద్యార్థిమృతి

విశాఖపట్నం మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ వద్ద ఆదివారం విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి నితిన్, స్నేహితులతో కలిసి రిజర్వాయర్ సందర్శనకు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతి చెందాడు. సోమవారం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించగా, తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్