విశాఖ: అమరావతి పేరుతో బాబు కొత్త డ్రామా: కేకే రాజు

వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు శనివారం మాట్లాడుతూ, అమరావతి రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. జగన్ ఎన్నడూ అమరావతిని వ్యతిరేకించలేదని, కేవలం అక్కడ జరిగిన అవినీతిని మాత్రమే ఎండగట్టారని స్పష్టం చేశారు. చంద్రబాబు తన నివాసానికి తప్ప రాజధానిలో రోడ్లు కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. విశాఖలో గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలు, జోడుగుళ్ళపాలెంలో రూ. 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్