విశాఖ‌: బాపూజీ ఆశ‌యాలు స్ఫూర్తిగా తీసుకోవాలి

బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ బీచ్ రోడ్డులోని బ్రిడ్జి స్కూల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశరావు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన మార్గం అనుసరణీయమని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన అహింసా పోరాటాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అతిథులు శాంతి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సహాయ కార్యదర్శి డాక్టర్ బాబ్జి, ఉపాధ్యాయులు లక్ష్మి, రమాదేవి, పలువురు బాలలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్