విశాఖ - బెంగళూరు ప్రత్యేక రైలు ఇక రెగ్యులర్

విశాఖపట్నం – బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు (08581/08582) ను రైల్వే శాఖ వారాంతపు ఎక్స్‌ప్రెస్‌గా రెగ్యులరైజ్ చేసింది. కొత్తగా 18509 నంబరుతో ఈ రైలు మే 10 నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:20 గంటలకు విశాఖలో బయలుదేరి, సోమవారం మధ్యాహ్నం 1:50కి బెంగళూరు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (18510) మే 11 నుంచి ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:50కి బెంగళూరులో బయలుదేరి, మంగళవారం మధ్యాహ్నం 1:30కి విశాఖ చేరుకుంటుంది. 18 కోచ్‌లతో నడిచే ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది.

సంబంధిత పోస్ట్