విశాఖపట్నంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి. వి. ఎన్. మాధవ్ పిలుపు మేరకు 'జనతా వారధి' కార్యక్రమంలో భాగంగా, ప్రజల నుంచి అందిన వినతులను సోమవారం కలెక్టరేట్ పి. జి. ఆర్. ఎస్ ద్వారా అధికారులకు అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్. ఎమ్. ఎన్. పరశురామరాజు ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. హిందూ దేవాలయ భూములను ఆక్రమణల నుండి కాపాడాలని, సింహాచలం పంచ గ్రామాల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి గోపి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.