విశాఖ: ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసుల‌కు ఫిర్యాదు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘కొత్త పలుకు’ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి, పార్టీ నేతల కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖలో ఫిర్యాదు నమోదైంది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆదేశాల మేరకు, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో గురువారం నాయకులు 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సిఐకి ఫిర్యాదు అందజేశారు. రాజకీయ నాయకుల భార్యలను నీచమైన భాషతో దూషించడంపై నిరసన వ్యక్తం చేస్తూ, ఈ ప్రచారానికి కారకులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్