విశాఖ: సీఎం చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. రూ. 80 వేల టోకరా

సీఎం చంద్రబాబు పేరుతో సైబర్ నేరగాళ్లు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని మోసం చేసి రూ. 80 వేలు కాజేశారు. టీడీపీ నేత దేవినేని ఉమా ఫోటోతో పాటు సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నట్లు వీడియో కాల్ చేసి నమ్మించారు. జీవీఎంసీ కమిషనర్‌కు అత్యవసరంగా డబ్బు పంపాలని సూచించడంతో బాధితుడు ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన తర్వాత సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్