అమెరికా సైనిక దాడిలో ఒమన్ నౌకలో మరణించిన విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ కుటుంబాన్ని బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరామర్శించారు. సురేష్ భార్య బాల భార్గవి, కుమారులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం బాధాకరమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సానుభూతి తెలిపారు. విదేశాల్లో ఉన్న సురేష్ భౌతికకాయాన్ని త్వరగా విశాఖకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.