విశాఖలోని ద్వారకానగర్‌లోని ఆదిత్య కళాశాల వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ, ఆదిత్య విద్యాసంస్థలు యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుల కంటే మూడు రెట్లు అదనంగా వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ప్లేస్‌మెంట్లు, కాండోనేషన్ ఫీజుల పేరుతో అక్రమంగా కోట్లాది రూపాయలు గడిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నేతలు శేఖర్, అభిషేక్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.