గత ప్రభుత్వ హయాంలో రూ. 6,400 కోట్లతో ప్రకటించిన సాగర్ మాల బీచ్ రోడ్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, విశాఖలోని విలువైన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి, కేవలం అమరావతిపైనే దృష్టి పెట్టాలన్నది చంద్రబాబు, లోకేష్‌ల వ్యూహమని ఆయన విమర్శించారు. విశాఖ ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అమర్నాథ్ మండిపడ్డారు.