శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద సంస్థ, హైటెక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అంధత్వ నివారణ కోసం పాత పోస్టాఫీస్ వద్ద శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 250 మంది ఓపీకి హాజరు కాగా, 60 మంది కంటి పరీక్ష నిమిత్తం ఎన్నికయ్యారు. ఈ కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ వైద్య శిబిరంలో పాల్గొని పర్యవేక్షించారు.