విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని నిరాశ్రయ గృహంలో మంగళవారం లక్ష్మీగాయత్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ దీనిని ప్రారంభించారు. 'ఆపరేషన్ జ్యోతిర్గమయ'లో భాగంగా డాక్టర్ కాండ్రేగుల వెంకట రామ్‌కుమార్ పేదలకు ఉచిత వైద్యం, మందులతో పాటు 20 బియ్యం బస్తాలను అందజేశారు. గత 11 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ రామ్‌కుమార్‌ను సీపీ అభినందించారు. డాక్టర్ రామ్‌కుమార్ ప్రతి నెలా నిరాశ్రయులకు బియ్యం అందజేస్తామని ప్రకటించారు.