ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేలు పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. విశాఖపట్నం-శాలిమార్, సంబల్పూర్-ఈరోడ్, భువనేశ్వర్-యశ్వంత్‌పూర్, యశ్వంత్‌పూర్-కటిహార్, ఎస్‌ఎంవీ బెంగళూరు-మాల్దా టౌన్ మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ స్పెషల్ రైళ్లు తమ సేవలను అందించనున్నాయి.