విశాఖలో రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఏబీఎన్ (ఆమోద పబ్లికేషన్స్) సంస్థకు ఉచితంగా కేటాయించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా భూమిని బదలాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏ చట్టం ప్రకారం ప్రైవేటు సంస్థలకు ఉచితంగా భూములు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సమయం కోరడంతో, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.