ఉప ఎన్నికలో బీటెక్ రవి భార్యను పులివెందుల జెడ్పీటీసీగా గెలిపించుకుని నీ స్థాయి నీకు తెలియజేస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సవాల్ విసిరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వైసీపీ మానుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబులతో కలిసి శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందులలో జగన్ కుటుంబం ఆ కనీసం అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు.