కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు రూ. 26 వేలు చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె నిర్వహించాయి. విశాఖ రైల్వే డీఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ప్రదర్శన జరిగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. కె. ఎస్. వి కుమార్ అధ్యక్షత వహించారు