విశాఖ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఎల్. జి. ఇండియా సి. ఎస్. ఆర్. ఫౌండేషన్ -హెచ్. పి. సి. ఎల్. నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థల ప్రతినిధులు శుక్రవారం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్వల్ప, మధ్యకాలిక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందిస్తారని ఎల్. జి. ఇండియా సి. ఎస్. ఆర్. ఫౌండేషన్ చైర్మన్ గిరిజా శంకర్ తెలిపారు.