విశాఖ‌: ‘మూలపేట పోర్టు’ పర్యటన: విశాఖలో ఉద్రిక్తత

‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు కె. కె. రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సోమవారం భారీ ర్యాలీగా బయల్దేరాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. అయితే, మూలపేట వెళ్లకుండా పోలీసులు ఉదయం నుంచే అడ్డుకుంటున్నారని, ఇది ప్రభుత్వ కక్షపూరిత చర్య అని పార్టీ నాయకులు విమర్శించారు.

సంబంధిత పోస్ట్