నగర పౌర గ్రంథాలయంలో శుక్రవారం సాయంత్రం ‘పాటే మీ మా ప్రాణం’ సంగీత సంస్థ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరిగింది. సీనియర్ గాయకుడు నాగులపల్లి వెంకటేశ్వరరావు సోలో ప్రదర్శనతో పాటు, 13 మంది గాయనీమణులతో కలిసి ఎన్టీఆర్, కృష్ణ చిత్రాల యుగళగీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ సామాజిక విశ్లేషకులు సన్‌మూర్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాత సినీ గీతాలకు మంచి స్పందన లభించింది. నేరేళ్ల రమేష్ సంగీత సహకారం అందించారు.