విశాఖలోని పురాతన నెహ్రూ బజార్ పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి నెహ్రూ బజార్, డైమండ్ పార్కులను పరిశీలించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నెహ్రూ బజార్ నగరం మధ్యలో ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రజలు కొనుగోళ్లకు వస్తున్నారని, అయితే అక్కడి దుకాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయని పేర్కొన్నారు.