విశాఖపట్నం నోవాటెల్‌లో జరిగిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 373 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేశ్, అనిత కూడా పాల్గొన్నారు.