విశాఖ‌: నేటితో ముగియనున్న ఆస్తి పన్ను రాయితీ

విశాఖ జీవీఎంసీ పరిధిలో ఆస్తి పన్ను రాయితీ పొందేందుకు గురువారం, ఏప్రిల్ 30 ఆఖరు రోజని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. పాత బకాయిలపై వడ్డీలో 50 శాతం మాఫీతో పాటు, 2026-27 ఆర్థిక సంవత్సర పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం రిబేటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వ రాయితీలు పొందాలని ఆయన కోరారు. నేటి తర్వాత ఈ వెసులుబాటు ఉండదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్