విశాఖ: దేశీయ కందమూలాలకు పునర్జీవం

గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జె. వి. రత్నం, ఆదివారం విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని 'ఏ హబ్' వద్ద జరిగిన ప్రకృతి పంటల సంతలో పాల్గొని, రైతులకు మూడు రకాల అరుదైన మాటంగు దుంపలను (ఎయిర్ పొటాటోలు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యంత పోషక విలువలు కలిగిన దేశీయ దుంప జాతులు క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, విత్తన సేకరణ ద్వారా వాటి ఉత్పత్తిని పెంచేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. మన దేశీయ కందమూలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్