దాట్ల శ్రీనివాసవర్మను అఖిల భారతీయ క్షత్రియ మహాసభ యువ జాతీయ ప్రతినిధిగా 2 సంవత్సరాల కాలానికి నియమించారు. ఈ మేరకు నేషనల్ అధ్యక్షులు కున్వర్ అవినీష్ సింగ్ శుక్రవారం తెలియజేశారు. సంస్థ నియమాలు సూచనలను పాటించడం ద్వారా ఆయన దక్షిణ భారతదేశంలో సంస్థను విస్తరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర‍్మను విశాఖలో పలువురు అభినందించారు.