విశాఖలోని కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీలో డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన 27 మంది విద్యార్థులకు సర్టిఫికేట్లను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఎ. కృష్ణ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ భవిష్యత్ అభివృద్ధికి పునాదిగా నైతిక విలువలు, క్రమశిక్షణను అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాలు పొందడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. కృష్ణ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నస్రీన్, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.