పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహావృక్షాలను కాపాడుకోవాలని, వాటికి రాఖీ కట్టి తమ బాధ్యతను చాటాలని వీఎంఆర్‌డీఏ మెట్రోపొలిటన్ కమిషనర్ కే. ఎస్. విశ్వనాథన్ పిలుపునిచ్చారు. విశాఖలోని దొండపర్తి రైల్వే గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న 138 ఏళ్ల వట వృక్షానికి శుక్రవారం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో ఆధ్వర్యంలో సెంట్ జోసెఫ్ కళాశాల, లిటిల్ ఏంజెల్స్ విద్యార్థినులు రాఖీ కట్టి పూజలు చేశారు.