భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖ వాల్తేరు రైల్వే డివిజన్ శుక్రవారం నుంచి స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించింది. రైల్వే ప్రాంగణాలను ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఆగస్టు 1 నుండి 15 వరకు జరిగే ఈ పక్షం రోజుల ప్రచారంలో భాగంగా, మొదటి రోజున డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా విశాఖ రైల్వే స్టేషన్‌లో ‘ప్రభాత్ ఫేరీ’ నిర్వహించి, ఉద్యోగులందరితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు.