విశాఖ: అంబటి రాంబాబుపై హత్యాయత్నం హేయం

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, అధికార మదంతో కూటమి నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబుపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులను చంపేందుకు కూడా వెనుకాడని స్థాయికి కూటమి నేతలు దిగజారడం ఆవేదన కలిగిస్తోందని, రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా మారాయని, ప్రజాస్వామ్య విలువలు కనుమరుగయ్యాయని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, ఇటువంటి దాడులకు భయపడకుండా ప్రజల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని కేకే రాజు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్