సమానతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని అస్తిత్వంపై జరిగే పోరాటంగా కాకుండా వివక్షపై జరిగే పోరాటంగా చూడాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ సభ్యులు ఆచార్య కేఎస్ చలం అన్నారు. సమాజంలో అసమానతలు పెరిగితేనే తిరుగుబాటు వస్తుందని ఆయన విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో సోమవారం విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన పతివాడ నాస్తిక్ రచించిన "కొలిమి రాజెయ్యాల్సిందే! పుస్తకాన్ని ఆవిష్కరించారు.