భారత సముద్ర రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కేంద్ర పోర్టులు, నౌకా, జలరవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. విశాఖలో సోమవారం ప్రారంభమైన రెండవ బిమ్‌స్టెక్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోర్ట్ చైర్మన్ అంగముత్తు అతిథులకు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి సోనోవాల్ మాట్లాడుతూ భారత్‌ను సముద్రరంగంలో అగ్రగామిగా నిలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.