విశాఖ: లాయర్ల సంక్షేమమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయంగా పోటీ చేస్తున్నట్లు విశాఖ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బెవర సత్యనారాయణ తెలిపారు. బుధవారం విశాఖ కోర్టులో ప్రచారం నిర్వహించిన ఆయన, గెలిస్తే విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, సీనియర్ న్యాయవాదులకు పెన్షన్, జూనియర్లకు స్టైఫండ్, బార్ అసోసియేషన్ల ఆదాయ వ్యయాల్లో పారదర్శకత కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పోరాడిన స్ఫూర్తితో బరిలో నిలిచానని, ఉత్తరాంధ్రలో ప్రచారం పూర్తి చేశానని తెలిపారు. ఫిబ్రవరి 13న విజయవాడలో జరిగే ఈ ఎన్నికల్లో 39 వేల మంది న్యాయవాదులు ఓటు వేయనున్నారని, అందరి సహకారంతో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్