విశాఖ: కూటమి రెండేళ్ల పాలన ‘మహిళలకు వెన్నుపోటు’

కూటమి ప్రభుత్వ రెండేళ్ల సభకు 'రెండేళ్ల నమ్మకం' కాదని, 'మహిళలకు వెన్నుపోటు, సంక్షోభం' అని పేరు పెట్టాలని వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. విశాఖపట్నంలో మాట్లాడుతూ, ఎన్నికల్లో మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామని బాండ్లు పంచి, అధికారంలోకి వచ్చాక 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని చంద్రబాబు పూర్తిగా అటకెక్కించారని మండిపడ్డారు. కూటమి ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌లోనూ ఈ పథకం ఊసే లేదని, రజనీకాంత్‌లా హామీలిచ్చి ఇప్పుడు గజనీలా నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. 'తల్లికి వందనం', 'అన్నదాత సుఖీభవ', 'సూపర్ సిక్స్' పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిందని ఆమె ఆరోపించారు.

సంబంధిత పోస్ట్