విశాఖ జిల్లాలోని సింహాచలం సింహగిరి ప్రదక్షిణ భక్తులకు వివేకానంద సంస్థ ప్రసాదాలు, బిస్కెట్ ప్యాకెట్లు, రాగి జావ, కాళ్ల నొప్పులకు, జ్వరానికి మందులను బుధవారం పంపిణీ చేసింది. జోడుగుళ్ళపాలెం గ్రామ కుల పెద్ద ఉమ్మడి పెద్ద దాసు వివేకానంద సభ్యులు బండారి గజపతి స్వామి, సత్తిబాబు, నాగరాజు, రమ ప్రియ, రమేష్ నాయుడు, సావిత్రి, కనకమహలక్ష్మి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం వరకు తమ సేవలు కొనసాగిస్తామని చెప్పారు.