భారీ వర్షానికి విశాఖ జలమయం

విశాఖ నగరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇటీవల కాలంలో ఇంతటి పెద్ద వాన కురవలేదు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షానికి నగరం పూర్తిగా తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, పాతనగరంలో మోకాలు లోతుకు పైగా నీరు చేరింది. దీంతో అనేక ఇళ్లలోకి నీరు ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్