సింహగిరిపై వీఎంఆర్డీఏ కమిషనర్ పూజలు

విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) కమిషనర్ తేజ్ భరత్ గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, గర్భాలయంలోని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ పర్యవేక్షణ అధికారి బి. సత్య శ్రీనివాస్ కమిషనర్‌ను శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్