గిరిజన కూలీలకు ఉపాధి హామీ పథకంలో ఫేషియల్ అటెండెన్స్ విధానం ఇబ్బందికరంగా మారింది. జీకే వీధి మండలం రింతాడ పంచాయతీ గుర్రాలగొంది గ్రామంలో కూలీలు ముఖ గుర్తింపు కోసం పౌడర్ పూసుకుని నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. పలుమార్లు ప్రయత్నించినా హాజరు నమోదు కాక పనిదినం కోల్పోతున్నామని కూలీలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలో ఉపాధి హామీ కొనసాగించాలని వారు కోరుతున్నారు.