విద్యార్థినులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన

పెదబయలు బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం 'మహిళా భద్రత – మన అందరి బాధ్యత' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నివారణ, మహిళల భద్రత, చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించారు. జిల్లా లోకల్ కంప్లైంట్స్ కమిటీ చైర్‌పర్సన్ డా. కె. కృష్ణకుమారి మాట్లాడుతూ, బాలికలు ఎలాంటి వేధింపులు ఎదురైనా ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ టి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్