నిరుపయోగంగా అగ్రికల్చర్ స్టోరేజ్ యూనిట్

హుకుంపేట మండలం కోట్నాపల్లి సమీపంలో లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ స్టోరేజ్ యూనిట్ ప్రారంభం కాకుండానే నిరుపయోగంగా మారింది. రైతుల పంటలను భద్రపరచడానికి ఉద్దేశించిన ఈ భవనానికి తాళాలు వేసి ఉండటంతో, నిల్వ సదుపాయం లేక రైతులు తమ పంటలను మధ్యవర్తులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. భవనం చుట్టూ తుప్పలు, కలుపు మొక్కలు పెరగడం నిర్లక్ష్యాన్ని స్పష్టంగా సూచిస్తోంది.

సంబంధిత పోస్ట్