గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వొద్దు: జేఏసీ

కొయ్యూరు మండలంలోని ఆడాకుల, ఆర్. కొత్తూరు గ్రామాల్లో గిరిజనేతరులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయవద్దని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ రాజుబాబు కోరారు. శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజకు వినతిపత్రం అందజేస్తూ, గిరిజన భూములపై గిరిజనేతరులకు ఎలాంటి హక్కులు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ఛైర్మన్‌ రామారావుదొర, జిల్లా మహిళా కార్యదర్శి శ్యామల వరలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్