చింతపల్లిలో త్వరలో ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించనున్నట్లు సీఐ బి. సింహాచలం తెలిపారు. ఆర్టీఏ అధికారులతో సమన్వయం చేసుకుని గిరిజనులకు స్థానికంగానే లైసెన్సులు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయవద్దని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ కలిగి ఉండాలని సూచించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు బ్లైండ్ కర్వ్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.